
విజయనగరం, 02 ఏప్రిల్ (హి.స.)ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశం గురించి వైసీపీ నాయకులు వాస్తవాలు మాట్లాడాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున కోరారు. బుధవారం విజయనగరంలోని టీడీపీ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడుతూ డీఆర్సీ సమావేశంలో లోతైన చర్చ జరిగిందని, టీడీపీ, వైసీపీ నాయకులు తమ అభిప్రాయాలను వివిధ సమస్యలపై వెల్లడించారన్నారు. ఈ సమావేశాలు గత ప్రభుత్వ హయాంలో మొక్కుబడిగా సాగేవని, ఈ అలవాటుతోనే వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతు న్నారన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్