వైకాపా నేత మాజీ మంత్రి పేర్ని నాని పై కేసు నమోదు
అనుమతి లేకుండా ఇంటి నిర్మాణం చేసారన్నదానిపై పేర్నినానిపై కేసు నమోదైంది
వైకాపా నేత మాజీ మంత్రి పేర్ని నాని పై కేసు నమోదు


మచిలీపట్నం, 03 ఏప్రిల్ (హి.స.)

: వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. గురువారం మచిలీపట్నం కొబ్బరితోట ప్రాంతంలో శ్రీపతి వెంకటాచలం అనే వ్యక్తి అనుమతి లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టారు. అక్రమ ఇంటి నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. దీంతో తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్న పేర్ని నాని.. అధికారులపై చిందులు తొక్కారు. అధికారులను, పోలీసులను తీవ్రంగా బెదిరించారు. దీంతో పోలీసు అధికారుల సంఘం చిలకలపూడి పీఎస్లో పేర్ని నానిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande