బెలంపూడి లోని ఓఎన్జీసీ చెందిన బీ ఎల్ ఎం ఎ ఎ బావి వద్ద స్వల్పంగా గా లీక్
బెల్లంపూడిలోని బీఎల్ఎం ఎఎ బావి వద్ద స్వల్పంగా గ్యాస్ లీకైంది
బెలంపూడి లోని ఓఎన్జీసీ చెందిన  బీ ఎల్ ఎం ఎ ఎ బావి వద్ద స్వల్పంగా గా లీక్


అమరావతి, 03 ఏప్రిల్ (హి.స.) బెల్లంపూడిలోని ఓఎన్జీసీకి చెందిన ‘బీఎల్ఎం-ఎఎ’ బావి వద్ద బుధవారం సాయంత్రం స్వల్పంగా లీకైన గ్యాస్ను ఓఎన్జీసీ వెల్ సర్వీసెస్ బృందం నియంత్రించింది. రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు బృందం పనిచేసి లీకు కాకుండా అరికట్టింది. చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేశారు. బావిహెడ్కు సంబంధించిన క్రిస్మస్ట్రీలో గ్రీజింగ్ నిప్పల్ నుంచి స్వల్పంగా లీకైన గ్యాస్ను వెల్ సర్వీసెస్ బృందం అరికట్టిందని ఓఎన్జీసీ ప్రొడక్షన్ విభాగం జీఎం వై.ఎన్.రావు ‘న్యూస్టుడే’కు వివరించారు. వాల్వ్లకు సంబంధించి గ్రీజింగ్ నిప్పల్ నుంచి స్వల్పస్థాయిలో లీకైన గ్యాస్ను పటిష్ఠ రక్షణ చర్యలు చేపట్టి అరికట్టామన్నారు. బావి వద్ద గ్యాస్ను నియత్రించే విషయంలో కలెక్టర్ మహేష్కుమార్ ఓఎన్జీసీ అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande