
వరంగల్, 03 ఏప్రిల్ (హి.స.)
వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పై అవినీతి నిరోధక శాఖ అధికారులు నేడు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. గురువారం కార్యాలయంలో తనిఖీలు చేసిన అధికారులు, శుక్రవారం అధికారుల ఇళ్లలో తనిఖీ చేస్తున్నారు. కార్యాలయంలో తనిఖీలు చేసిన సమయంలో తిష్టవేసిన ఇరవై మంది దళారులను పట్టుకున్నారు. వారి నుంచి లెక్కల్లో లేని నగదు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ల ఖాతాలకు చరవాణి ద్వారా బదిలీ అయిన డబ్బుల పై ఆరా తీస్తున్నారు. లక్షల డబ్బు బదిలీ అయినట్లు గుర్తించి ఈ చర్యలు చేపట్టారు. దళారుల చరవాణి సందేశాల ఆధారంగా వెలుగులోకి భారీ అవినీతి బాగోతం బయటపడింది. . ప్రభుత్వానికి దర్యాప్తు అధికారుల సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..