గ్రూప్-1 పై సుప్రీంకోర్టు తీర్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
గ్రూప్ 1 పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు
Cm


హైదరాబాద్, 03 ఏప్రిల్ (హి.స.)

గ్రూప్1 ఉద్యోగ నియామకాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఇది ఉద్యోగ నియామకాల పట్ల మా ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపు గా భావిస్తున్నానన్నారు. రాష్ట్రంలో గ్రూప్-1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను నిన్న సుప్రీంకోర్టు డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన రేవంత్ రెడ్డి.. కొలువుల కోసం ఏళ్లకు ఏళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసి, కన్నవారి కష్టం పై ఆధారపడలేక, కొలువు వస్తుందో రాదో అన్న దిగులుతో పదేళ్లు కాలం వెళ్లదీసిన గ్రూప్ -1 ఆశావహులకు ఇది పెద్ద ఊరట అన్నారు.

ప్రజా ప్రభుత్వం వచ్చీరావడంతోనే నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి నెలల వ్యవధిలో నియామక పత్రాలు అందజేసిందన్నారుఉద్యోగాలను ఎంపికైన వారికి మరో సారి 링 అభినందనలు అని తెలిపారు. అత్యంత పారదర్శకంగా ఈ నియామకాలను పూర్తి చేసిన టీజీపీఎస్సీ ఛైర్మన్, ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande