
అమరావతి, 03 ఏప్రిల్ (హి.స.)అమరావతికి చట్టబద్ధతతో సంబరాలు మిన్నంటాయి. జై అమరావతి.. జయహో ఆంధ్రప్రదేశ్ అంటూ, పచ్చ కండువాలు గాల్లో తిప్పుతూ రాజధానికి భూములిచ్చిన అన్నదాతలు, ఆడపడుచులు వేడుకలు చేసుకున్నారు. ఇందుకు అమరావతి నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలోని పవిత్ర భూమి వేదికైంది. గురువారం రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన వెంటనే రాజధాని గ్రామాల నుంచి వేలాది మంది రైతులు, మహిళలు, రాజధాని పరిరక్షణ ఉద్యమ నేతలు ఉద్దండరాయునిపాలెం చేరుకున్నారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
అక్కడున్న పవిత్రమైన నీరు-మట్టికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో సీఎం చంద్రబాబు సతీసమేతంగా పాల్గొన్నారు. పవిత్ర మట్టి, జలాలు ఉంచిన వేదికకు చంద్రబాబు సాష్టాంగ ప్రమాణం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన జ్యోతిని తన సతీమణి భువవనేశ్వరితో కలసి వెలిగించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ