
హైదరాబాద్, 03 ఏప్రిల్ (హి.స.) నగరంలోని పబ్లలో డ్రగ్స్ కల్చర్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా కొండాపూర్ లోని 'క్వాక్ ఏరీనా పబ్' (Quack Arena Pub)పై ఈగల్ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పబ్లో పార్టీ జరుగుతున్న సమయంలో ఆకస్మికంగా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు, అక్కడ ఉన్న సుమారు 64 మందికి డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొత్తం 8 మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో ఆరుగురు గంజాయి సేవించినట్లుగా, మరో ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు., దీనిపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనకు నిర్వహించిన డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చిందని తెలుపుతూ ఓ వీడియోను సైతం పోస్ట్ చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని, అనవసరంగా తనపై దుష్ప్రచారం చేయవద్దని ఆమె ఆ వీడియోలో కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..