రేవుపోలవరం తీరంలో అలల ఉదృతి కి సముద్రంలో మునిగిపోతున్న పదో తరగతి విద్యార్దిని.కాపాడిన మెరైన్ పాలసీలు
నీటిలో మునిగిపోతున్న విద్యార్థిని రక్షించిన పోలీసులు
రేవుపోలవరం తీరంలో అలల ఉదృతి కి సముద్రంలో మునిగిపోతున్న  పదో తరగతి విద్యార్దిని.కాపాడిన మెరైన్ పాలసీలు


ఎస్. రాయవరం, 03 ఏప్రిల్ (హి.స.)

, రేవుపోలవరం తీరంలో అలల ఉద్ధృతికి సముద్రంలో మునిగిపోతున్న పదో తరగతి విద్యార్థిని మెరైన్ పోలీసులు రక్షించారు. మాకవరపాలెం మండలం జి.కోడూరుకు చెందిన చవాకుల శ్రీనివాస్ (15) పదో తరగతి పరీక్షలు ముగియడంతో స్నేహితులతో కలిసి రేవుపోలవరం తీరానికి వచ్చాడు. తీరంలో స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా అలల ఉద్ధృతికి సముద్రంలో మునిగిపోయాడు. వెంటనే స్నేహితులు పెద్దగా కేకలు వేయడంతో అక్కడే విధుల్లో ఉన్న మెరైన్ ఏఎస్సై కృష్ణ, కానిస్టేబుల్ చినబాబు, హోంగార్డులు పి.అప్పలరాజు, శ్రీను మునిగిపోతున్న శ్రీనివాస్ను బయటకు తీసుకువచ్చి ప్రథమ చికిత్స చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande