జగన్ మానసిక పరిస్థితి ఏం బాలేదు : మాజీ మంత్రి విమర్శలు
జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
ex-minister-ganta-srinivasarao-com


అమరావతి, 03 ఏప్రిల్ (హి.స.) : మాజీ సీఎం జగన్ మానసిక పరిస్థితిపై టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మానసిక పరిస్థితి సరిగ్గా ఉందో లేదో ఒక్కసారి పరిశీలించుకోవాలని సూచించారు. గతంలో విశాఖను రాజధానిగా చేస్తామన్న జగన్.. ఇప్పుడు మావిగన్ అని కొత్త స్వరం అందుకున్నారని విమర్శించారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్ పోర్టును తీసుకొచ్చింది తామేనని చెప్పుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్నగాక మొన్న శంకుస్థాపన చేసిన ఆర్సెలార్ మిత్తల్ కంపెనీని కూడా తానే తెచ్చానని చెప్పుకుంటున్నారన్నారు. వైసీపీని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా.. జగన్ లో ఇంకా మార్పురాలేదన్నారు

ఇక ఈ నెలలోనే రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన జరగనున్నట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు. జూన్ నెలలో భోగాపురం ఎయిర్ పోర్టు లాంఛనంగా ప్రారంభమై.. అందరికీ అందుబాటులోకి వస్తుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande