లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్.. తిరుమలకు పోటెత్తిన భక్తులు
వరుస సెలవులు కావడంతో తిరుమలలో రద్దీ నెలకొంది.
తిరుమల


తిరుమల, 03 ఏప్రిల్ (హి.స.)

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగినట్లు టీటీడీ వెల్లడించింది. మళ్లీ లాంగ్ వీకెండ్ (వరుసగా మూడ్రోజులు సెలవులు) రావడంతో తిరుమలకు భక్తులు క్యూ కట్టారు.

ప్రస్తుతం 31 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం నిరీక్షిస్తుండగా.. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 12 గంటలు పడుతుందని పేర్కొంది. అలాగే సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4-6 గంటల సమయం, రూ.300 శీఘ్రదర్శనం భక్తులకు 3-4 గంటల సమయం పడుతుందని వెల్లడించింది.. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ.4.18 కోట్లు సమకూరింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande