వెదర్ అప్డేట్స్ : పగలు దంచికొట్టే ఎండ.. సాయంత్రం పిడుగులు
తెలుగు రాష్ట్రాల్లో ఎండతో పాటుగా కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వ ర్షాలు పడే అవకాశం
Rain


అమరావతి, 03 ఏప్రిల్ (హి.స.)

తెలుగు రాష్ట్రాల్లో నేడు తీవ్రమైన ఎండలు ఉండబోతున్నట్టు భారత వాతావరణశాఖ పేర్కొంది. అయితే కొన్ని చోట్ల సాయంత్రం ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలియజేసింది. అలాగే ఏపీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD హెచ్చరించింది.

ఏపీలో పరిస్థితి నిప్పుల కొలిమిని తలపించనుంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఎండ తీవ్రత సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతోంది. కడప, కర్నూలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41°C - 42°C మార్కును తాకనున్నాయి. తీవ్రమైన వడగాల్పుల వీస్తాయని అధికారులు పేర్కొన్నారు.

కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వారాల పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని, ఏప్రిల్ రెండవ వారం తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande