ముగిసిన కేబినెట్.భేటీ 20 అంశాలకు ఆమోదం (UPDATE)
ముగిసిన కేబినెట్.భేటీ 20 అంశాలకు ఆమోదం
chandra babu


అమరావతి, 30 ఏప్రిల్ (హి.స.)

ఉద్యోగ, మౌలిక వసతులు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పెట్టుబడుల వంటి అంశాలపై క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దాదాపు మూడున్నర గంటలపాటు సమావేశమైన మంత్రివర్గం.. దాదాపు 20కిపైగా అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది.

మున్సిపాలిటీలకు చెందిన ఆస్తుల లీజ్ రెన్యువల్, అద్దె నిర్ణయ విధానాల సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో మ్యుటేషన్ ఛార్జీలను ఒకే విధంగా అమలు చేసే చట్టసవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దిల్లీలోని ఏపీ భవన్లో అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ కార్యాలయంలో ఆఫీస్ మేనేజర్ పోస్టును సెక్షన్ ఆఫీసర్గా అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. రామాయపట్నంలో నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ పోర్ట్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు రూ.354 కోట్ల మేర పాలనా అనుమతులకు అంగీకారం తెలిపింది.

ఏపీ మార్క్ఫెడ్కు రూ.1800 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. అమరావతిలో పలు నిర్మాణాలకు రూ.1,208 కోట్లతో పాలనా అనుమతులకు అంగీకారం తెలిపింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2000 బ్యాచ్కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతికి పచ్చజెండా ఊపింది. హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల్లో 21 కొత్త పోస్టులు సృష్టించేందుకు అంగీకారం తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande