స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు రెగ్యులర్గా మార్పు
స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు రెగ్యులర్గా మార్పు
Train


గుంతకల్లు(అనంతపురం), 01 మే (హి.స.): ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం నడుపుతున్న మైసూరు-కాకినాడటౌన్ స్పెషల్ బైవీక్లీ ఎక్స్ప్రెస్ (07033/34)ను ఇకపై రెగ్యులర్ బైవీక్లీ ఎక్స్ప్రెస్గా ప్రమోట్ చేశారు.

కాకినాడటౌన్-మైసూరు (నం. 17289) బైవీక్లీ రెగ్యులర్ ఎక్స్ప్రెస్ను ఈ రోజు మే 1వ తేదీ నుంచి సోమ, శుక్రవారాల్లో వారానికి రెండురోజులు నడపనున్నట్లు రైల్వేశాఖ అధికారులు పత్రికా ప్రకటణ ద్వార తెలిపారు.

ఈ రైలు కాకినాడ టౌన్లో ఉదయం 9 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 4 గంటలకు మైసూరుకు చేరుకుంటుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (17290) రైలు రేపు మే 2వ తేదీ నుంచి మంగళ, శనివారాలలో మైసూరులో సాయంత్రం 5.05 గంటలకు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 11-30 గంటలకు కాకినాడ టౌన్కు చేరుకుంటుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande