
తాడిపత్రి, 01 మే (హి.స.)
తాడిపత్రి మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇగుడూరు గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో సీఐ శివగంగాధర్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు ఉదయం దాడులు జరిగాయి.
ఈ దాడుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7,680 నగదు, 4 స్మార్ట్ ఫోన్లు, 6 బైకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల నిఘా పెరిగింది. ఎవరు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని, మీకు తెలిసిన ఇలాంటివి జరిగితే సమాచారం అందించాని పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV