
గోనెగండ్ల, 01 మే (హి.స.)నిబంధనలను అతిక్రమించి భారీ సౌండ్లతో శబ్ద కాలుష్యానికి పాల్పడిన డీజే యాజమానితో పాటు, వివాహ నిర్వాహకులపై కేసు నమోదు చేసి, డీజే వాహనాన్ని సీజ్ చేశారు.
పోలీసుల అనుమతి లేకుండా గ్రామాల్లో రాత్రి పూట ఇష్టానుసారంగా సౌండ్ను పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న డీజే వాహనాలను సీజ్చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రబాబు ఈ రోజు తెలిపారు.
మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో పెళ్లిళ్లకు డీజే వాహనాలను ఏర్పాటు చేసుకునే వారు పోలీసుల అనుమతి తీసుకొని రాత్రి పది గంటల లోపు నిలిపివేయాలని సూచించారు. అలా చేయని వారిపై చర్యలు తప్పవన్నారు.
పోలీసుల హెచ్చరికలను అతిక్రమించిన వాహనాలను సీజ్ చేశామన్నారు. రాత్రి పది గంటల లోపు డీజేలు నిలిపివేయాలని సీఐ చంద్రబాబు ప్రకటించడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గరంలో డీ జే సౌండ్స్పై పోలీసులు ఆంక్షలు విధించారు. గీత దాటితే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు. డి.జె సౌండ్స్ వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, డి.జెలకు ఎలాంటి అనుమతులు లేవని ప్రకటించారు. రాత్రి సమయాల్లో పెళ్ళి ఊరేగింపులు, ఇతర శుభకార్యాల వేళ డీజేలు ఏర్పాటు చేయడం ద్వారా శబ్ద కాలుష్యం ఏర్పడడంతో పాటు, అనేక గొడవలకు కారణంగా మారుతున్నాయి. చాలామందికి నిద్ర లేకుండా పోతుంది. ఈ నేపధ్యంలో వరంగల్ ట్రై సిటీస్లో డి.జె లు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, డి.జెలకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV