
కదిరి , 01 మే (హి.స.)
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల(NTR Bharosa Pensions) పంపిణీ ఈరోజు(శుక్రవారం) ఉదయం నుంచి జోరుగా కొనసాగుతోంది. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డుల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు పింఛన్లను అందజేస్తున్నారు.
కదిరి పట్టణంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శుక్రవారం ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ డబ్బులు పంపిణీ చేశారు. ప్రతినెలా ఒకటో తారీకు పేదల పండుగగా ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ జరుగుతుందని ఆయన తెలిపారు. లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV