ఏపి కేబినెట్.. 2,540 కోట్లతో అమరావతి.అభివృద్ధి(update)
ఏపి కేబినెట్... 2,540 కోట్లతో అమరావతి.అభివృద్ధి
chandra babu


అమరావతి, 30 ఏప్రిల్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.2,540 కోట్లతో అమరావతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులతో పాటు అమరావతిలోని సచివాలయం గ్లాస్ క్లాడింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల్లో సవరణలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ బాధితులకు గృహ యూనిట్ ఖర్చు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

అసెంబ్లీ పరిసరాల్లో సివిల్ వర్క్స్ కోసం రూ.798 కోట్ల ప్రణాళికతో పాటు ఉండవల్లి జోన్లో మౌలిక వసతుల కోసం రూ.580 కోట్ల ప్రణాళికకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 220 కేవీ కేబుల్స్ రీరూటింగ్ పనులకు రూ.1,180 కోట్లు కేటాయించింది. ప్రకాశం జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్కు భూమిని కేటాయించింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2000 బ్యాచ్కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్ కల్పించే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. ఢిల్లీలో ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124.5 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande