నేడు మంత్రి బీ సీ జనార్ధన్ రెడ్డి తో టైటాన్ డిఫెన్స్ గ్రూప్ ప్రతినిధుల సమావేశం
నేడు మంత్రి బీ సీ జనార్ధన్ రెడ్డి తో టైటాన్ డిఫెన్స్ గ్రూప్ ప్రతినిధుల సమావేశం
నేడు మంత్రి బీ సీ జనార్ధన్ రెడ్డి తో టైటాన్ డిఫెన్స్ గ్రూప్ ప్రతినిధుల సమావేశం


అమరావతి, 30 ఏప్రిల్ (హి.స.)

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తిస్థాయిలో ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో సహాయ, సహాకారాలు అందిస్తామని ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డివ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో నేడు ఆంధ్రప్రదేశ్ దేశానికే పెట్టుబడుల హాబ్గా నిలుస్తోందని పేర్కొన్నారు. సుస్థిరమైన, నమ్మకమైన, బలమైన కూటమి పాలనపై విశ్వాసంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు.

ఈరోజు (శుక్రవారం) మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో టైటాన్ డిఫెన్స్ గ్రూప్ ప్రతినిధులు సమావేశం అయ్యారు. సచివాలయంలోని ఆర్ అండ్ బీ, ఐ అండ్ ఐ శాఖ కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా టైటాన్ డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ గ్రూప్ చైర్మన్, సీఈఓ కె. గిరికుమార్, సంస్థ ప్రతినిధులు కలిశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టైటాన్ కంపెనీ నిర్వాహకులు ఆసక్తి చూపించారు. ప్రస్తుతం ఏపీలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని టైటాన్ సంస్థ ప్రతినిధులకు మంత్రి వివరించారు.

కర్నూలు ఎయిర్ పోర్టులో ఎమ్మార్వో, సిమ్యులేషన్ సెంటర్ల ఏర్పాటుకు ఈ సంస్థ ఆసక్తి చూపుతోంది. అలాగే, నంద్యాల జిల్లాలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్ఛరింగ్ యూనిట్ స్థాపనకు సంస్థ ప్రతినిధులు ఉత్సాహం చూపించారు. తమ సంస్థకు ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్, మైనింగ్, ట్రేడింగ్ వంటి బహుళ రంగాల్లో ఉన్న అనుభవాన్ని సంస్థ ప్రతినిధులు వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande