హై కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు
హై కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు
హై కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు


అమరావతి, 30 ఏప్రిల్ (హి.స.)

బట్టమేక పక్షి సంరక్షణ కోసం రాజస్థాన్ అటవీశాఖ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనుసరిస్తున్న పద్ధతులను రోళ్లపాడులో అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సొసైటీ ఫర్ బస్టర్డ్ రికవరీ ప్రోగ్రాం సంస్థ అధ్యక్షుడు లింగారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈరోజు విచారణకు రాగా.. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర పర్యావరణ అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి, కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ, ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ట్రాన్స్కో)లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు.. ట్రాన్స్కో తరఫున స్టాండింగ్ కౌన్సిల్ వీవీ సతీశ్ వాదనలు వినిపిస్తూ.. పక్షులను దారి మళ్లించే ఏర్పాటు నిమిత్తం టెండర్లు పిలిచామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande