
హైదరాబాద్, 30 ఏప్రిల్ (హి.స.)32 ఏళ్ల పోలీస్ జీవితంలో ఎన్నో సమస్యలు, ఆనందం, అనుభవాలు, జ్ఞాపకాలతో ప్రయాణం చేశానని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. తనను వెన్ను తట్టి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. 1970, 1980లో పోలీసుల పరిస్థితులు వేరని.. ఇప్పుడు పని చేస్తున్న పోలీస్ సిబ్బంది పరిస్థితులు వేరన్నారు. గతం కంటే ఇప్పుడున్న పోలీసింగ్లో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. పోలీస్ విభాగం పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్తో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రస్తుత సిటిజన్స్కు ఫ్రెండ్లీ పోలీసింగ్ అవసరమన్నారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ నడిపించామని తెలిపారు. భవిష్యత్తుకు అనుగుణంగా పోలీస్ శాఖను సిద్ధం చేశామని చెప్పారు.
‘నా స్వరాష్ట్రానికి నన్ను డీజీపీగా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. సీఎం ఎన్నో కీలక బాధ్యతలు అప్పగించారు. నేను ఈ స్థాయికి రాడానికి కారణమైన నా గురువులకు ధన్యవాదాలు. యంగ్ పోలీస్ వల్ల పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలి. పోలీస్ పవర్ అంటే గౌరవంగా జీవించడం. సమష్టి కృషి వల్లే ఈ స్థాయిలో ఉన్నాను. నా కుటుంబసభ్యులకు ధన్యవాదాలు. మంచి ఛాలెంజింగ్ అధికారి రాబోతున్నారు.. రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్కు అభినందనలు’ అని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్