
హైదరాబాద్, 30 ఏప్రిల్ (హి.స.)నగరంలోని పలు ప్రాంతాలకు మే 2వ తేదీన 24గంటల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తుతుందని వాటర్బోర్డు అధికారులు ప్రకటించారు. ఆసిఫ్నగర్ ఫిల్టర్ బెడ్స్లో ఉన్న 1.36ఎంఎల్ సామర్థ్యం గల పాత బ్యాలెన్సింగ్ ట్యాంక్ శుభ్రపరిచే పనులను మే 2న ఉదయం 6గంటల నుంచి మరుసటి రోజు(3వ తేదీ) ఉదయం 6 గంటల వరకు చేపట్టనున్నారు.
ఈ పనుల నేపథ్యంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో లోప్రెజర్తో నీటిసరఫరా, గోషామహల్, కార్వాన్, గోల్కొండ, కవాడిగూడ, జూబ్లీహిల్స్ సర్కిళ్ల పరిధుల్లో సరఫరాలో అంతరాయాలు తలెత్తనున్నాయని తెలిపారు. వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్