
హైదరాబాద్, 30 ఏప్రిల్ (హి.స.)పిల్లల దత్తత విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర శిశు, సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. దత్తత కావాలనుకున్న వారు ఐసీడీసీని సంప్రదించాలని సూచించారు.
సమ్మక్క - సారలమ్మ జాతరలో పిల్లల తల్లులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో, జన సమూహ ప్రాంతాల్లో, బస్సు టెర్మినల్, రైల్వేస్టేషన్, బస్టాండ్లలో తల్లిపాల ఫీడింగ్ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక, శిశు, సంక్షేమ శాఖ అధికారులు, రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్