మోసగించడమే కేసీఆర్ నైజం
నమ్మించి మోసగించడం కేసీఆర్ నైజమని నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు.
Mallu ravi


హైదరాబాద్, 30 ఏప్రిల్ (హి.స.)నమ్మించి మోసగించడం కేసీఆర్ నైజమని నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. రావణుడి చేతిలో విభీషణుడు భంగపడ్డట్లు కేసీఆర్ చేతిలో జీవన్రెడ్డి మోసపోవడం ఖాయం అని పేర్కొన్నారు. ఆమనగల్లులో మంగళవారం ఎంపీ రవి విలేకరులతో మాట్లాడుతూ... కేసీఆర్ను ప్రజలు నమ్మడం లేదన్నారు. ప్రజా ఎన్నికల్లో ఓడి అధికారానికి దూరమైన కేసీఆర్ ఫామ్హౌ్సకే పరిమితమై విపక్షనేతగానూ విఫలమయ్యారని విమర్శించారు.

ప్రతి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరిస్తున్నారని, వచ్చే ఎన్నికలే ఆ పార్టీకి చివరి ఎన్నికలని జ్యోష్యం చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని, ఓర్వలేక కేసీఆర్, ఆ పార్టీ నాయకులు విషం కక్కుతున్నారన్నారు. కేసీఆర్ ఎన్ని మాటలు మాట్లాడినా నష్టం లేదన్నారు. 42ఏళ్లు జీవన్రెడ్డి కాంగ్రెస్లో అనేక పదవులు అనుభవించి పార్టీని వీడి కాంగ్రెస్ ను విమర్శించడం ప్రజలు గమనిస్తున్నారన్నారు.

తాను చెప్పినట్లు కాంగ్రెస్ వినలేదని పార్టీ వీడి 42ఏళ్ల వ్యక్తిగత ప్రతిష్టను జీవన్రెడ్డి దిగజార్చుకున్నారని అన్నారు. లెఫ్టిస్ట్ భావాలున్న జీవన్రెడ్డి వ్యక్తి పూజ, అధిపత్యం ఉండే బీఆర్ఎస్లో చేరడం దురదృష్టకరం అన్నారు. జీవన్రెడ్డి కాంగ్రెస్ గురించి ఎన్నిసార్లు విమర్శిస్తే తయన తనకు తానే తిట్టుకున్నట్టన్నారు. రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కార్కు ప్రజలే కొండంత బలం అని ఎంపీ రవి ధీమా వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande