
వేంపల్లి:, 30 ఏప్రిల్ (హి.స.)
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కడప జిల్లా వేంపల్లి పోలీస్స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సీఐ నరసింహులు ఆయన్ను విచారించారు. తెదేపా మండల కన్వీనర్ రామమునిరెడ్డి ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 1న పోలీసులు అంబటిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం అంబటి రాంబాబు పులివెందుల బయలుదేరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ