
హైదరాబాద్, 30 ఏప్రిల్ (హి.స.)టీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. టీఆర్ఎస్ పేరును కల్వకుంట్ల కవితకు అధికారికంగా ప్రకటిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈనెల 25న మేడ్చల్లోని అద్వయ కన్వెన్షన్లో టీఆర్ఎస్ పార్టీ పేరును కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ‘తెలంగాణ రక్షణ సేన’ పేరును ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ మేరకు ఈరోజు(గురువారం) బంజారాహిల్స్లోని కవిత నివాసానికి వెళ్లిన ఎన్నికల అధికారులు.. పార్టీకి అనుమతి ఇస్తూ లేఖను అందజేశారు.
తన కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ అంటూ కవిత ప్రకటించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా.. టీఆర్ఎస్ పేరును కవిత పార్టీకి ఇవ్వొద్దంటూ కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఈసీకి లేఖలు రాశారు. అయినప్పటికీ కవిత పార్టీ పేరును ‘తెలంగాణ రక్షణ సేన’గా ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్