మా సెంటర్లపై ఎలాంటి తనిఖీలు జరగలేదు: నోవా ఐవీఎఫ్
మా సెంటర్లపై ఎలాంటి తనిఖీలు జరగలేదు: నోవా ఐవీఎఫ్
nova


హైదరాబాద్, 30 ఏప్రిల్ (హి.స.)హైదరాబాద్లోని ప్రముఖ నోవా ఐవీఎఫ్ ఫర్టిలిటీపై గుజరాత్ పోలీసులు తనిఖీలు చేశారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నోవా సంస్థ నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. చిన్నారుల అక్రమ రవాణా కేసులో మురుగన్ గ్యాంగ్కు.. తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ ఫర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసులు తనిఖీలు చేయలేదని వెల్లడించారు.

చట్టానికి అనుగుణంగా తాము క్లినిక్ సెంటర్లు నిర్వహిస్తున్నామని, క్లినికల్, ఎథికల్, లీగల్ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సోషల్ మీడియాలో తమ ఫర్టిలిటీ సెంటర్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు పూర్తి అవాస్తవమని, ఎలాంటి ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు తమ సెంటర్లపై జరగలేదని వివరణ ఇచ్చారు. రోగులకు ఉత్తమ సేవలు అందించడమే తమ లక్ష్యమని నోవా ఐవీఎఫ్ ఫర్టిలిటీ నిర్వాహకులు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande