
హైదరాబాద్, 30 ఏప్రిల్ (హి.స.)ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో అరుదైన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. గ్లైకోజెన్ స్టోరేజ్ సమస్యతో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ను ఉస్మానియా వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. 10 కిలోల బరువున్న బాలుడికి లివర్ మార్పిడి చేశారు. తండ్రి లివర్ నుంచి కొంత భాగాన్ని సేకరించి చిన్నారికి అమర్చారు. 14 గంటల పాటు క్లిష్ట శస్త్రచికిత్స కొనసాగింది.
ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తిగా ఉచితంగా డాక్టర్లు చికిత్స అందజేశారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దేశంలో ప్రభుత్వ రంగంలో ఇలాంటి శస్త్రచికిత్సలు అత్యంత అరుదని డాక్టర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా వైద్యుల బృందాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్