
యాదాద్రి భువనగిరి, 30 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హనుమపురం గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో తెరవకపోవడం వల్ల రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారని, వర్షాలకు ధాన్యం తడిసిపోతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల, ముఖ్యంగా సన్న రకం ధాన్యం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, నిబంధనల పేరుతో రైతులను మోసం చేస్తోందని విమర్శించారు.
రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం ఎస్ పి పెంచిన కూడా అధికారులు,రైస్ మిల్లర్లు,కమిషన్ ఏజెంట్లు దళారులు కుమ్మకై రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు, తక్కువ ధరకే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని చూస్తున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడంలో సహకరించకపోవడంతో కేసులు పెట్టండి అని ప్రభుత్వానికి సూచించారు.తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వైఖరి విడిచిపెట్టి ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. హమలీల కొరత, గన్ని బ్యాగుల కొరతను నివారించి తూకం పక్రియను వేగవంతం చేయాలని కోరారు ఆయన వెంట జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్ తదితరులు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు