మక్తల్ ను బిజినెస్ హబ్ గా తీర్చిదిద్దుతా : మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్ ను బిజినెస్ హబ్ గా తీర్చిదిద్దుతా : మంత్రి వాకిటి శ్రీహరి
Minister


నారాయణపేట, 30 ఏప్రిల్ (హి.స.)

మక్తల్ ను బిజినెస్ హబ్ల అభివృద్ధిచేస్తామని రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. బుధవారం రాత్రి మక్తల్ పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కోత్వాల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం'లో భాగంగా 'రేవంతన్న భరోసా' కింద ముస్లిం మైనారిటీ మహిళలకు ఉచితంగా కుట్టు యంత్రాలను మంత్రి పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనారిటీ స్కూల్ హాస్టళ్లు తెలంగాణలోనే ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో రెండు వందల కుట్టు యంత్రాలను అందజేశామని తెలిపారు. ప్రతి ఇంటిలో కుట్టు యంత్రం ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మైనారిటీ కుటుంబాల్లో పెళ్లి జరిగితే 'షాదీ ముబారక్' పథకం అందిస్తున్నామని, 'మహాలక్ష్మి పథకం' ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. సెట్విన్ సంస్థను మక్తల్లో ఏర్పాటు చేశామని, వస్త్రాలు కుట్టేందుకు ప్రత్యేక షెడ్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మైనారిటీ సంక్షేమం భాగంగా క్రికెట్ ఆటగాడు సిరాజ్కు 400 గజాల ఇంటి స్థలం, డీఎస్పీ ఉద్యోగం, రూ.2 కోట్ల నగదు ప్రభుత్వం ఇచ్చినట్లు పేర్కొన్నారు. మహిళలు ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి ద్వారా ఎదగాలని సూచించారు. మక్తల్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నామని, నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande