ఈదురు గాలులతో దెబ్బతిన్న పంటలు
ఈదురు గాలులతో దెబ్బతిన్న పంటలు
ananthapuram/crops-damaged-by-strong-wind


గుత్తి, 30 ఏప్రిల్ (హి.స.)గుత్తి మండల వ్యాప్తంగా మంగళ వారం రాత్రి వీచిన ఈదురు గాలులకు మామిడి పంట భారీగా దెబ్బతి నడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఉబిచెర్ల, కరిడికొండ, బేతాపల్లి తదితర గ్రామాల్లో రైతులు మామిడి పంటను సాగు చేశారు. ఊటకల్లు గ్రామంలో దాదాపు 300 ఎకరాలకు పైగా సాగు చేశారు. అయితే నిన్న రాత్రి వీచిన ఈదురుగాలులకు మామిడి కాయలు భారీగా రాలిపోయాయని రైతులు లక్కీరెడ్డి శేఖర్, బాలకృష్ణ, శ్రీరాములు, గోపాల్ వాపోయారు. పంట చేతికివచ్చిన దశలో ఈదురు గాలులకు కాయలు నేలరాలి తీవ్రంగా నష్టపోయామన్నారు. ఒక్కో రైతు తోటలో 70 నుంచి 100 బాక్స్ల వర కు కాయలు నేలరాలాయని రైతులు గోపాల్, శ్రీనివాసులు, సుధాకర్, పులికొండ ఆవేదన వ్యక్తం చేశారు. రూ. లక్షలు పెట్టుబడి పెట్టినా దిగు బడి వచ్చే దశలో తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande