ఆన్లైన్ కోసం ఖచ్చితమైన ఇంటి వివరాలను నమోదు చేసుకోవాలి : ములుగు జిల్లా కలెక్టర్
ఆన్లైన్ కోసం ఖచ్చితమైన ఇంటి వివరాలను నమోదు చేసుకోవాలి : ములుగు జిల్లా కలెక్టర్
కలెక్టర్


ములుగు, 30 ఏప్రిల్ (హి.స.)

ఈనెల 26 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ ద్వారా ఆన్లైన్ లో గృహాలకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన సమాచారమే నమోదు చేసుకోవాలని జిల్లా ములుగు జిల్లా కలెక్టర్ బర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ మహేందర్ జీతో కలిసి కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి గృహాల వివరాలను గోప్యంగా ఉంచబడతాయని, ప్రస్తుతం గృహాల గణన మాత్రమే నిర్వహిస్తామని తెలిపారు.

ఆన్లైన్లో సైట్ https://se.census. gov.in ఆన్ చేయగానే పూర్తి వివరాలు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, 33 అంశాల పై ప్రతి విషయం వాస్తవమై ఉండాలని సూచించారు. పూర్తి వివరాల అనంతరం ఓకే చేస్తే ఎస్ఈ ఐడీ వస్తుందని, దానిని భద్రపరచుకొని మే 11 వ తేదీ అనంతరం ఇండ్లకు వద్దకు వచ్చే గణన అధికారికి చూపించిన అనంతరం వారు అప్లోడ్ చేస్తారని తెలిపారు. ఇండ్ల గణన పూర్తి అయిన అనంతరం వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జన గణన చేపడతారని, వివరాలు పొందుపరిచిన అనంతరం తప్పులు దొర్లితే ఎడిట్ చేసుకునే అవకాశం సైతం ఉంటుందని అన్నారు. విలేకరుల సమావేశంలో కలెక్టరేట్ పర్యవేక్షకులు మంజుల, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి రఫిక్, ఎనమలేటర్లు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande