గడువులోగా రీసర్వేను పూర్తి చేయాలి
గడువులోగా రీసర్వేను పూర్తి చేయాలి
the-resurvey-must-be-completed-within-the-deadline-15


ఆదోని,, 30 ఏప్రిల్ (హి.స.) రీ సర్వే ప్రక్రియను నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయాలని జేసీ నూరుల్ఖమర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆదోని సబ్కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ పరి ధిలోని మండలాల తహసీ ల్దార్లు, సర్వే అధికారులతో రీ సర్వే, పీజీఆ ర్ఎస్ (ప్రజా విన్నపాల పరిష్కారం), రెవెన్యూ అంశాలపై ఆయన సుధీర్ఘ సమీక్ష నిర్వహించారు.

. ఆయన మాట్లాడుతూ డివిజన్వ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న రీ సర్వే పనులను వేగవంతం చేయాలన్నారు. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో డ్రాఫ్ట్ పట్టాదారు పాసుపుస్తకాలను 100 శా తం సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. మే, జూన్ నెలల నాటికి అర్హులైన ప్రతిరైతు చేతికి పాసు పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నాన్చకుండా వారు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని సూచించారు. ఆదోని తహసీల్దార్ శేషఫణి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీనివాసరాజు తదితరలు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande