కుప్పకూలిన టమోటా ధరలు.. రైతన్నల ఆశలు ఆవిరి..!
కుప్పకూలిన టమోటా ధరలు.. రైతన్నల ఆశలు ఆవిరి..!
tomoto


చిత్తూరు, 30 ఏప్రిల్ (హి.స.):చిత్తూరు జిల్లా పలమనేరు మార్కెట్లో టమోటా ధరలు పెరిగినట్లే పెరిగి మూడు రోజుల వ్యవధిలో గణనీయంగా పడిపోయాయి.

కొన్ని నెలలుగా టమోటాకు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతన్నలకు ఒక్కసారిగా ఆశ కిరణం కనిపించింది. తోటల్లో పండిన పంటకు ధర రాక నిరాశతో కూలీలను పెట్టి బయట పడేయడం, పశువులతో మేపించడం, ట్రాక్టర్తో చదును చేయించడం వంటి దుస్థితులు ఎదుర్కొన్న వారు, ఇటీవల మార్కెట్లో ధరలు పెరగడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు.

చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్లో నాలుగు రోజుల క్రితం 15 కేజీల టమోటా బాక్స్ ధర రూ.400 నుంచి రూ.500 వరకు పలకడంతో రైతుల్లో కొత్త ఆశలు మొలిచాయి. పెట్టుబడులు పెరిగిపోయిన ఈ కాలంలో కనీసం రూ.300 దాటితేనే గిట్టుబాటు ఉంటుందని భావిస్తున్న రైతులకు ఈ ధరలు కొంత భరోసా కలిగించాయి. సాగుకు అవసరమైన ఎరువులు, కూలీల ఖర్చులు, ఇతర సామగ్రి ఇలా అన్నీ కలిపి దాదాపు రూ.2 లక్షల వరకు ఖర్చవుతోందని వారు చెబుతున్నారు.

పలమనేరు మార్కెట్లో టమోటా ధరలు పెరిగినట్లే పెరిగి మూడు రోజుల వ్యవధిలో గణనీయంగా పడిపోయాయి. పది రోజుల కిందట 15 కిలోల బాక్సు ధర రూ.550 వరకు పలికింది. ఐదు రోజులు సుమారుగా అదే ధర కొనసాగింది. ఆదివారం బాక్సు ధర రూ.500 పలకగా, సోమవారం రూ.450, మంగళవారం రూ.400, బుధవారం రూ.350కి పడిపోయింది. కాగా.. ధరలు పెరుగుతుండటంతో ఈసారి అప్పులు తీరిపోతాయని భావించిన టమోటా రైతులు, నిరాశ చెందారు. కనీసం ఇదే ధర కొనసాగినా నష్టం రాదని అంటున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande