అమరావతి మహిళా రైతులు కాలినడకన విజయవాడ దుర్గమ్మ సన్నిధికి
కాలినడకన వెళ్లి మొక్కు చెల్లించుకున్న మహిళా రైతులు
అమరావతి మహిళా రైతులు కాలినడకన విజయవాడ దుర్గమ్మ సన్నిధికి


అమరావతి, 06 ఏప్రిల్ (హి.స.)ఇటీవలే ఏపీరాజధాని అమరావతికి చట్టభద్రత లభించిన విషయం తెలిసిందే..దాంతో ఏపీలో సంబరాలు ఆకాశాన్నంటుతున్నాయి. చాలామంది తమ హర్షాన్ని వ్యక్త ంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి మహిళారైతులు తమ కలలు కన్న కల నెరవేరిందని మొక్కులు చెల్లించుకున్నారు.విజయవాడ ప్రసిద్ధదేవాలయం బెజవాడ దుర్గమ్మ సన్నిధికి కాలినడక బయలుదేరి వెళ్లారు. . ప్రకాశం బ్యారేజీ సీతానగరం నుంచి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ పాదయాత్ర చేపట్టారు. అమ్మవారికి సారె, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande