పోలవరం ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానికుల తీవ్ర భయాందోళనలు
పోలవరం, 06 ఏప్రిల్ (హి.స.) ,:పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. దండంగి గ్రామం వద్ద నాలుగు లేగ దూడలపై పెద్దపులి దాడి చేసి చంపేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత
పోలవరం ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానికుల తీవ్ర భయాందోళనలు


పోలవరం, 06 ఏప్రిల్ (హి.స.)

,:పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. దండంగి గ్రామం వద్ద నాలుగు లేగ దూడలపై పెద్దపులి దాడి చేసి చంపేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పెద్దపులి వీరవరంలోని కొండ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా పూడిపల్లి, నాగలపల్లి, బోడిగూడెం పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ దూడలను వేటాడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

పెద్దపులి సంచారంతో గిరిజన గ్రామాల్లో భయాందోళన చెందుతున్న ప్రజలు.. అటవీ శాఖ అధికారులు పులిని బంధించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులి సంచారంతో రాత్రివేళ ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. పశువులను కాపాడుకోవడం కష్టంగా మారిందిన గిరిజనులు వాపోతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి పులిని బంధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande