లఘు చిత్రాలు ఆసక్తితో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యువకుల్లో.ముగ్గురు పెన్నా నదిలో చిక్కుకున్నారు
వల్లూరు06 ఏప్రిల్ (హి.స.), : లఘుచిత్రం తీయాలనే ఆసక్తితో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యువకుల్లో ముగ్గురు పెన్నా నదిలో సరదగా ఈత కొట్టేందుకు వెళ్లి నీటిలో చిక్కుకున్నారు. ఇద్దరు మృత్యువాత పడగా ఒకరు గల్లంతయ్యారు. ఈ సంఘటన జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. ప
లఘు చిత్రాలు ఆసక్తితో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యువకుల్లో.ముగ్గురు పెన్నా నదిలో చిక్కుకున్నారు


వల్లూరు06 ఏప్రిల్ (హి.స.), : లఘుచిత్రం తీయాలనే ఆసక్తితో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యువకుల్లో ముగ్గురు పెన్నా నదిలో సరదగా ఈత కొట్టేందుకు వెళ్లి నీటిలో చిక్కుకున్నారు. ఇద్దరు మృత్యువాత పడగా ఒకరు గల్లంతయ్యారు. ఈ సంఘటన జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కడప, మదనపల్లె, కుప్పం, నందలూరు తదితర ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది యువకులు సురేష్, సాయిమనోజ్, భగవాన్, ఫిరోజ్, హష్రఫ్, హరిబాబు, కృష్ణచైతన్య, హర్షవర్ధన్లు సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమయ్యారు. ఓ లఘు చిత్రం తీయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా కడప పరిసర ప్రాంతాల సందర్శనకు ఆదివారం వచ్చారు. పలు చోట్ల సన్నివేశాలు చిత్రీకరించారు. సాయంత్రం వల్లూరు మండల పరిధిలోని పెన్నానదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. వారిలో నగరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న కృష్ణచైతన్య (20), హర్షవర్ధన్ (22), కడపలోని ఓ కళాశాలలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్న హరిబాబు(25)లు నదిలోకి దిగారు. ముగ్గురికీ ఈత రాకపోవడంతో సుడిగుండంలో చిక్కుకున్నారు. గమనించిన తోటి యువకులు హుటాహుటిన నదిలోకి దిగి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే వారు మునిగిపోయారు. విషయం తెలుసుకున్న ఎస్సై శివరామిరెడ్డి అగ్నిమాపక సిబ్బందితో అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. హరిబాబు, హర్షవర్ధన్ మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన కృష్ణచైతన్య కోసం గాలిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande