
అమరావతి, 06 ఏప్రిల్ (హి.స.)
రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల బుకింగ్లు, డెలివరీల మధ్యనున్న వ్యత్యాసం క్రమంగా తొలగుతోందని పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. శని, ఆదివారాల్లో బుకింగ్ల కంటే డెలివరీలు అధికంగా జరిగాయని పేర్కొంది. ‘మార్చి రెండోవారంలో రోజుకు 5 లక్షలకు పైగా గ్యాస్ బుకింగ్లు జరిగాయి. దీంతో డెలివరీలు సామర్థ్యానికి మించి ఇవ్వటం సాధ్యం కాలేదు. బ్యాక్లాగ్లు పెరిగిపోయాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ వాస్తవ పరిస్థితిని వివరించటంతో ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలిగాయి. శనివారం 2,11,302 గ్యాస్ బుకింగ్స్ అయితే 2,77,367 డెలివరీలు జరిగాయి. ఆదివారం 2,25,824 గ్యాస్ బుకింగ్లు జరిగితే 2,92,247 డెలివరీలు జరిగాయి. బ్యాక్లాగ్ డెలివరీలను పూర్తిచేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది’ అని వివరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ