
భోగపరం, 06 ఏప్రిల్ (హి.స.) ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా నిలిచే అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తుది దశకు చేరుకున్నాయని, ఈ ఏడాది జులై లేదా ఆగస్టులో ప్రారంభిస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి చెప్పారు. విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో పర్యటించిన ఆయన విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించారు. జీఎంఆర్ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం నిర్మాణ పనులు 97% పూర్తయ్యాయన్నారు. జులై 5, 8 లేదా ఆగస్టు 17, 19 తేదీలలో ఏదో ఒక రోజున విమానాశ్రయాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఎర్త్ రన్వే పనులు 100%, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పనులు 95% పూర్తయ్యాయని వెల్లడించారు. అనుసంధాన రహదారుల అభివృద్ధి పనులు త్వరలో పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మరో ఆరు కొత్త విమానాశ్రయాల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. విశాఖపట్నం నుంచి ఏడు ప్రాధాన్య రహదారుల అభివృద్ధి పనులు పురోగతిలో ఉండగా ఆనందపురం కూడలి వద్ద ఎలివేటెడ్ రోడ్ డీపీఆర్ తయారీ జరుగుతోందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ