
అమరావతి, 06 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని, విజయవాడను సినీ రాజధానిగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి (ఏపీ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్ర పరిశ్రమ ఇక్కడకు వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. నిర్మాత, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఏఎం రత్నం మాట్లాడుతూ ఫిల్మ్ చాంబర్ అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలన్నారు. ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు అంబటి మధుమోహన్కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 100 ఎకరాలు కేటాయించి, ఫిల్మ్ సిటీ నిర్మాణానికి అవకాశం కల్పించాలని కోరారు. ఆ ఫిల్మ్ సిటీకి ఎ
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ