ముంబైలో 'టాయ్ కారు' బాంబు కలకలం.. ఐసిస్, జైషే ఉగ్రవాదుల భారీ కుట్ర భగ్నం!
ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన ఏటీఎస్ అధికారులు
Mumbai terrorist


ముంబై, 06 ఏప్రిల్ (హి.స.)

దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)ని భారీ పేలుళ్లతో అతలాకుతలం చేసేందుకు ఉగ్రవాదులు చేసిన కుట్రను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అధికారులు భగ్నం చేశారు. రిమోట్ కంట్రోల్తో నడిచే బొమ్మ కార్లలో పేలుడు పదార్థాలను అమర్చి, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పేల్చాలని ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి పేలుడు పదార్థాలను అమర్చేందుకు సిద్ధం చేసిన ఎలక్ట్రానిక్ బోర్డులు, పదులు సంఖ్యలో రిమోట్ కంట్రోల్ ద్వారా నడిచే వాహనాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపించే నిషేధిత వీడియోలు, పుస్తకాలను సైతం సీజ్ చేశారు. అయితే, నిందితులు ముంబైలోని ప్రముఖ రైల్వే స్టేషన్లు, మతపరమైన ప్రదేశాలు, షాపింగ్ మాల్ను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లకు పథకం రచించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande