అరుణాచల్ ప్రదేశ్ సీఎంకు సుప్రీంకోర్టు షాక్.. CBI విచారణకు ఆదేశం
విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది
Supreme court


న్యూఢిల్లీ, 06 ఏప్రిల్ (హి.స.)

అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ (Pema Khandu)కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది.

అధికార దుర్వినియోగానికి పాల్పడి, కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలకు భారీ ఎత్తున ప్రభుత్వ కాంట్రాక్టులను కట్టబెట్టారనే ఆరోపణలపై సీబీఐ (CBI) ప్రాథమిక విచారణకు సుప్రీంకోర్టు ఇవాళ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది సోమవారం ఆదేశించింది. మొత్తం అక్రమాలపై ప్రాథమిక విచారణ జరిపి 16 వారాల్లోపు నివేదికను సమర్పించాలని సీబీఐని జస్టిస్ విక్రమ్ నాథ్ (Justice Vikramnath) నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. విచారణకు సంబంధించిన ఎలాంటి రికార్డులు ధ్వంసం కాకుండా చూడాలని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (Chief Secretary) కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే గడిచిన పదేళ్లలో ఖండూ బంధువుల సంస్థలకు దక్కిన ప్రతి వర్క్ ఆర్డర్ను సీబీఐ క్షుణ్ణంగా పరిశీలించనుంది.

సీఎం పెమా ఖండూ తన భార్య, తల్లి, సోదరులకు చెందిన సంస్థలకు సుమారు రూ.1,270 కోట్ల రూపాయల విలువైన పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్టులను నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ (Prashant Bhushan) దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 2015 నుంచి 2025 మధ్య కాలంలో జరిగిన వివిధ రకాల కాంట్రాక్టుల కేటాయింపులపై లోతైన విచారణ జరగాలని ధర్మాసనం పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande