పుదుచ్చేరి ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా నడుపుతున్నారు
పుదుచ్చేరిప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా నడుపుతున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు
పుదుచ్చేరి ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా నడుపుతున్నారు


పుదుచ్చేరి, 06 ఏప్రిల్ (హి.స.)

పౌర హక్కులు మరియు ప్రాంతీయ స్వయంప్రతిపత్తిని కాలరాస్తూ, పుదుచ్చేరి ప్రభుత్వాన్ని ఢిల్లీ నుండిరిమోట్ కంట్రోల్ద్వారా నడుపుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పుదుచ్చేరి పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్థానిక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉండాల్సిన కనీస అధికారాలను కూడా కేంద్రం లాగేసుకుందని, ప్రతి చిన్న నిర్ణయానికి ఢిల్లీ వైపు చూడాల్సిన పరిస్థితి కల్పించారని ఆయన విమర్శించారు. ఇది కేవలం రాజకీయ అధికారం కోసం చేస్తున్న ప్రయత్నం కాదని, పుదుచ్చేరి ప్రజల ఆత్మగౌరవాన్ని మరియు వారి అభీష్టాన్ని అవమానించడమేనని రాహుల్ పేర్కొన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని రాష్ట్ర పాలనలో కేంద్రం అనవసరంగా జోక్యం చేసుకుంటోందని ఆయన మండిపడ్డారు.

ముఖ్యంగా తమిళ సంస్కృతి, భాష మరియు స్థానిక సంప్రదాయాలను గౌరవించని వారు పాలన సాగించడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో పుదుచ్చేరి ప్రజలు ఈ రిమోట్ కంట్రోల్ పాలనకు చరమగీతం పాడుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించే దిశగా పోరాడుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంలో రాజకీయ సెగను రాజేశాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande