హర్మూజ్ జలసంధి వద్ద హైడ్రామా.. 17 భారత ఇంధన నౌకల రాకకు బ్రేక్
17 భారతీయ ఇంధన నౌకలు హార్మూజ్ జలసంధి వద్ద నిలిచిపోయాయి
Harmuj


న్యూఢిల్లీ, 07 ఏప్రిల్ (హి.స.)

పశ్చిమాసియా (West Asia)లో యుద్ధ ఉద్రిక్తత కారణంగా భారత ఇంధన భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ముడి చమురు (Crude Oil), ఎల్పీజీ (LPG), ఎల్ఎన్జీ (LNG) లోడ్తో భారత్ వైపు వస్తున్న 17 భారీ నౌకలు ప్రస్తుతం హర్మూజ్ జలసంధి (Strait of నిలిచిపోయాయి. Hormuz) సమీపంలో నిలిచిపోయిన 17 నౌకల్లో ముడి చమురుతో పాటు వంట గ్యాస్, ప్రకృతి వాయువు (LNG) నిల్వలు ఉన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నౌకలు ముందుకు కదలలేకపోతున్నాయి. ఈ సరఫరా అంతరాయం కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పరిస్థితితులను నిశితంగా గమనిస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లేదా ఇతర దేశాల నుంచి దిగుమతులు పెంచే అంశంపై ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande