
సాతంకుళం, 07 ఏప్రిల్ (హి.స.)దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తమిళనాడులోని సాతంకుళం కస్టడీ మరణాల కేసులో మధురై కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. తండ్రీకొడుకులైన జయరాజ్, బెన్నిక్స్ల మృతికి కారణమైన తొమ్మిది మంది పోలీసులను దోషులుగా తేల్చి, వారికి మరణ శిక్ష విధించింది. మదురై మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి జి. ముత్తుకుమారన్ ఈ తీర్పును ప్రకటించారు. ఈ కేసును అత్యంత అరుదైన కేసు (రేర్ ఆఫ్ ది రేరెస్ట్)గా అభివర్ణించిన న్యాయమూర్తి, రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసులో దోషులుగా తేలిన వారిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్. శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్లు పి. రఘు గణేశ్, కె. బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుల్స్ ఎస్. మురుగన్, ఏ. సామిదురై, కానిస్టేబుల్స్ ఎం. ముత్తురాజ్, ఎస్. చెల్లదురై, థామస్ ఫ్రాన్సిస్, ఎస్. వెయిలుముత్తు ఉన్నారు. విచారణ సమయంలో పదో నిందితుడైన రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్దురై కోవిడ్తో మరణించాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi