మార్కాపురం జిల్లా అర్థవీడు మండలం.గన్నెపల్లిలో భారీ చోరీ
మార్కాపురం జిల్లా అర్థవీడు మండలం.గన్నెపల్లిలో భారీ చోరీ
మార్కాపురం జిల్లా అర్థవీడు మండలం.గన్నెపల్లిలో భారీ చోరీ


అర్ధవీడు:, 13 మే (హి.స.)

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం గన్నేపల్లిలో జరిగిన చోరీ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కనుమర్లపూడి గోపాలకృష్ణ ఇంట్లో 20 తులాల బంగారు ఆభరణాలతోపాటు, రూ.6 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు శ్రీశైలం వెళ్లారు. ఇంటి వెనుక తలుపు గడియ పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. ఇనుప బీరువాను ధ్వంచేసి బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. మంగళవారం రాత్రి శ్రీశైలం నుంచి వచ్చిన గోపాలకృష్ణ.. ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు, కంభం సీఐ మల్లికార్జున, అర్ధవీడు ఎస్సై శివ నాంచారయ్య సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి క్లూస్ టీమ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande