ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకోండి
ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకోండి
ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకోండి


పొదిలి:, 13 మే (హి.స.)

ప్రకాశం జిల్లా పొదిలిలోని ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ విజయ సునీత సందర్శించారు. పాఠశాలల్లో పదో తరగతిలో ఉత్తీర్ణత కాని విద్యార్థులతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకొని 100% ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఆయా పాఠశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశమై వారికి పలు సూచనలు చేశారు. ఆమె వెంట డిప్యూటీ డీఈఓ ఎం.శ్రీనివాసులు, పొదిలి ఎంఈఓ నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ మారుతీ రావు, తహసీల్దార్ కృష్ణారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande