అమరావతిలో పర్యటించిన చంద్రబాబు
అమరావతిలో పర్యటించిన చంద్రబాబు
అమరావతిలో పర్యటించిన చంద్రబాబు


అమరావతి, 13 మే (హి.స.)

రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు(బుధవారం) పర్యటించారు. ఈ సందర్భంగా నిడమర్రు వద్ద కిమ్స్ ఆస్పత్రికి భూమి పూజ చేశారు. బైసర్ స్కిల్ వర్సిటీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సంపద సృష్టించడం చాలా సులభమన్నారు. దేశానికే మెడికల్ హబ్గా హైదరాబాద్ తయారైందని తెలిపారు. లక్ష మందికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తామని.. వైద్యులు కూడా ఏఐని నేర్చుకుంటున్నారని అన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకం గతంలో ఎప్పుడూ చూడలేదని సీఎం విమర్శించారు. లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేదే కూటమి ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. 2027 మే 13న కిమ్స్ ఆస్పత్రిని ప్రారంభిస్తామని అన్నారు. 2028 ఆగస్టు 15 కంటే ముందే విశాఖలో గూగుల్ ఆపరేషన్లు మొదలవుతాయని తెలిపారు. డిసెంబర్ నాటికి దేశానికి క్వాంటం కంప్యూటింగ్కు చిరునామాగా అమరావతి అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్లలో అమరావతి నుంచి ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్లు అందించబోతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

రాజధానికి భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామని సీఎం స్పష్టం చేశారు. ఫేజ్-2కు పిలుపునిస్తే రైతులు ముందుకొచ్చారన్నారు. బంగారం కొనడంపై అందరూ ఆలోచించాలని సూచించారు. కర్నూలులో బంగారం ఉత్పత్తి మొదలు కాబోతోందని వెల్లడించారు. దేశంలో ఉత్పత్తయ్యే బంగారంలో 50శాతం ఇక్కడే అవ్వబోతోందని చెప్పారు. దీంతో దిగుమతి ద్వారా ఎదురవుతున్న సమస్యలను అధిగమించొచ్చని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande