
మదనపల్లె(చిత్తూరు), 13 మే (హి.స.)
:హంద్రీ-నీవా కాలువల్లో కృష్ణా జల ప్రవాహం ఆగిపోవడంతో పెండింగ్ పనులను పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అనంతపురం, మదనపల్లె సర్కిల్లో పెండింగ్లో ఉన్న ప్రధాన కాలువతో పాటు పుంగనూరు, కుప్పం బ్రాంచి కెనాల్లో మిగిలిన లైనింగ్ పనులు, ఇతర కాంక్రీటు నిర్మాణాలు పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే అడవిపల్లె రిజర్వాయర్ నుంచి మొదలై చిత్తూరు జిల్లా అరగొండ వరకూ సాగే నీవా బ్రాంచి కెనాల్, కొత్తగా చేపట్టే తిరుపతి జిల్లా మూలపల్లె నుంచి చంద్రగిరి, అక్కడి నుంచి కళ్యాణి డ్యామ్కు ఎత్తిపోతల ద్వారా కృష్ణా జలాలను తీసుకెళ్లే ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. ఇందుకు మొత్తం రూ.1,140 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. వీటికి ప్రభుత్వం నుంచి ఆమోద ముద్ర పడగానే పనులు ప్రారంభం కానున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ