
కృష్ణా జిల్లా:, 13 మే (హి.స.)
గన్నవరం ఎయిర్పోర్టులో పుణె ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. పుణె నుంచి హైదరాబాద్కు 187 మంది ప్రయాణికులతో విమానం బయలుదేరింది. అయితే, హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో చాలా సేపు గాలిలోనే చక్కర్లు కొట్టింది ఇండిగో విమానం.
అయినా, వాతావరణ పరిస్థితులు ఏమాత్రం అనుకూలించకపోవడంతో పైలట్ విమానాన్ని గన్నవరం విమానాశ్రయం వైపునకు మళ్లించారు. అక్కడికి చేరుకున్న అనంతరం అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఏం జరుగుతుందో అర్థం కాని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరికి సురక్షితంగా విమానం కిందకు దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, సుమారు రెండు గంటలుగా గన్నవరం ఎయిర్పోర్టు రన్వేపైనే పుణె ఇండిగో విమానాన్ని అధికారులు నిలిపివేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ