ప్రభుత్వ పాఠశాలల విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి: అడిషనల్ కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలల విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి: అడిషనల్ కలెక్టర్
Collector


కరీంనగర్, 13 మే (హి.స.)

ప్రభుత్వ పాఠశాలల విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్వని తానాజీ వాకడే అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జవహర్ నవోదయ విద్యాలయంలో చొప్పదండి మండల విద్యాధికారి జ్యోతి ఆధ్వర్యంలో చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల సర్పంచ్ లు, మున్సిపల్ పాలకవర్గ ప్రజాప్రతినిధుల విద్యా వారోత్సవాల వర్క్ షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ అశ్వని తానాజీ వాకడే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధుల సమిష్టి కృషితో సాధ్యమవుతుందని అన్నారు.

మౌళిక వసతులు కల్పించి గ్రామీణ ప్రాంత విద్యావ్యవస్థను పటిష్టం చేయాలని బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్పంచ్లను ప్రజాప్రతినిధులను కోరారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. అందుకు తగిన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. అందుకు అనుగుణంగా అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల విద్యార్థుల నృత్యాలు అలరించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande